టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను పెంచే లక్ష్యంతో, పాత మోడల్ పంచ్ ఈవీపై దీపావళి పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా కొనుగోలుదారులు గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
నారద టైమ్స్: టాటా పంచ్ ఈవీ కొనుగోలుదారులకు దీపావళి పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి తెచ్చింది. టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను పెంచే లక్ష్యంతో పాత మోడల్ పంచ్ ఈవీపై గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు ప్రకటించింది. ఇందులో రూ.1.10 లక్షల వరకు గ్రీన్ బోనస్, రూ.35 వేల వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. ఈ ఆఫర్లు 2025 వరకు అందుబాటులో ఉంటాయి. అయితే డీలర్షిప్, నగరం, వాహన వేరియంట్, స్టాక్ లభ్యతను బట్టి డిస్కౌంట్లు మారవచ్చునని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని టాటా మోటార్స్ సూచిస్తోంది.











