2026లో శాంతిభద్రతల విధుల్లో గాయపడిన పోలీసు సిబ్బందికి ఆర్థిక సహాయం అందించాలని ఢిల్లీ పోలీస్ శాఖ నిర్ణయించింది. పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 వేల చొప్పున, ఇతర తీవ్ర గాయాలపాలైన వారికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ ఆర్థిక సహాయాన్ని ఢిల్లీ పోలీస్ సంక్షేమ సంఘం నిధి నుంచి చెల్లించనున్నారు. 2026లో ఇప్పటివరకు వివిధ శాంతిభద్రతల విధుల్లో 250 మందికి పైగా పోలీసులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక పరిస్థితుల్లో మరింత ఆర్థిక సహాయం అవసరమైన సందర్భాల్లో, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అదనపు సాయం కోసం ప్రతిపాదనలు పంపవచ్చని తెలిపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి, అవసరమైన వారికి మరింత సహాయం అందించే అవకాశం ఉంది. కాగా, 2023లో విధి నిర్వహణలో గాయపడిన పోలీసులను గౌరవించేందుకు ఆహత్ వీర్ సమ్మాన్ పత్ర కార్యక్రమాన్ని కూడా ఢిల్లీ పోలీస్ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా పోలీసుల సేవలను గుర్తించి, వారిని సత్కరిస్తున్నారు.












