వరంగల్, నారద టైమ్స్: 2026-27 విద్యా సంవత్సరానికి 4 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునఃప్రారంభించినట్లు కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 16.09.2026 నాటి నోటిఫికేషన్ కు కొనసాగింపుగా, బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ 05-10-2026 సాయంత్రం 05:00 గంటల వరకు చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్: ://.. ద్వారా షెడ్యూల్‌లోపు రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలని సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించే ముందు అర్హత ప్రమాణాలు మరియు ప్రాస్పెక్టస్ ను జాగ్రత్తగా చదవాలి.
రిజిస్ట్రేషన్ మరియు ధృవీకరణ రుసుము ఓసీ/బీసీ అభ్యర్థులకు 2,500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 2,000గా నిర్ణయించారు. అభ్యర్థులు మెరిట్ జాబితా, సీట్ మ్యాట్రిక్స్, కౌన్సెలింగ్/వెబ్-ఆప్షన్ షెడ్యూల్ కు సంబంధించి తదుపరి నోటిఫికేషన్ల కోసం వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు.






